Guppedantha Manasu : నా తల్లిని నేను దగ్గరుండి కూడా చూసుకోలేని పరిస్థితి!
on Apr 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1041 లో.. అనుపమకు దేవయాని ఫోన్ చేస్తుంది. కాలేజీలో గొడవ జరిగిందట కదా, నీకు తెలియదా? పేరెంట్స్, స్టూడెంట్స్ మీటింగ్ పెట్టాలని వసుధార అంటే పేరెంట్స్ లేని వాళ్ళు కూడా ఉంటారని శైలేంద్ర అన్నాడట.. దాంతో మను కోపంగా గాజు గ్లాస్ ని విరిచేశాడట కదా.. పాపం రక్తం కూడా వచ్చిందట కదా.. శైలేంద్ర కట్టుకడదామని వెళ్తే కోప్పడాట కదా.. పాపం మను ఎంత బాధపడ్డాడో అని దేవాయని అంటుంది. మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారని అనుపమ బాధపడుతుంది.
ఆ తర్వాత మహేంద్ర కోపంగా అనుపమ దగ్గరకి వస్తాడు. కాలేజీ లో మనుకి అవమానం జరిగిందని చెప్పగానే.. నాకు తెలుసని అనుపమ అంటుంది. తెలిసే ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు.. పాపం తండ్రి గురించి తెలియక మను ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? ఎన్ని అవమానాలు ఎదరుకుంటున్నాడో తెలుసా అని మహేంద్ర అంటాడు. మను తండ్రి ఎవరో చెప్పమని మహేంద్ర అడుగుతాడు. నేను చెప్పలేనని అనుపమ అంటుంది. అయిన మహేంద్ర అడుగుతుంటే.. అప్పుడే మను వచ్చి.. మీరు ఇలా మేడమ్ ని ఇబ్బంది పెట్టకండి, చెప్పాలనుకుంటే చెప్తుంది. ఇబ్బంది పెడితే తనని నేను ఇప్పుడే తీసుకొని వెళ్తానని మను అంటాడు. " అందుకు నేను ఒప్పుకోను.. మీరు అనుపమ గారిని అమ్మ అని పిలిస్తేనే తీసుకొని వెళ్ళండి " అని మనుకి వసుధార కండిషన్ పెడుతుంది.
ఆ తర్వాత మను కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నా తల్లిని నేను దగ్గర ఉండి కూడా చూసుకోలేని పరిస్థితి. దీనికి కారణం నువ్వే అమ్మ అంటూ మను బాధపడుతాడు. ఆ తర్వాత ఏంజిల్ కి విశ్వనాథ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. అత్తయ్యపై ఎవరో ఎటాక్ చేశారని ఏంజిల్ చెప్పగానే.. విశ్వనాథ్ షాక్ అవుతాడు. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదని విశ్వనాథ్ అంటాడు. నేను వస్తానని విశ్వనాథ్ అనగానే.. నేనే వస్తాను అని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read